చెన్నై జట్టులోకి.. జూనియర్ మలింగా?
ఎన్నో ఆశలతో 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఆడమ్ మిల్నే కూడా జట్టుకు దూరమయ్యాడు. గాయపడి జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. జట్టు తొలి మ్యాచ్లోనే బౌలింగ్ చేస్తూ గాయపడ్డ మిల్నే స్థానాన్ని శ్రీలంక యువ పేసర్ జూనియర్ మలింగా గా పిలువబడే మతీష పతిరనా తో భర్తీ చేయాలని నిర్ణయించింది చెన్నై యాజమాన్యం. ఈ క్రమంలోనే అతన్ని 20 లక్షలకు జట్టులోకి తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది అని తెలుస్తుంది.
19 ఏళ్ల మతిష 2020, 2022 అండర్ 19 వరల్డ్ కప్ లో సభ్యుడిగా కొనసాగాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ మలింగా బౌలింగ్ యాక్షన్ తో సరిగ్గా సరిపోయే విధంగా బౌలింగ్ యాక్షన్ చేస్తూ ఉంటాడు మతిష. శ్రీలంక తరఫున 2 టి20 లు ఆడాడు. కాగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది..