ఐపీఎల్ : కేఎల్ రాహుల్ జేబుకు చిల్లు పడింది?
ఇక ప్రస్తుతం లక్నో జట్టు 4 వ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఇక ఇప్పుడు జరిమానా పడింది అయితే ఇలా జరిమానా పడింది అంటే స్లో ఓవర్ రేట్ కారణంగానే పడి ఉంటుంది అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే పొరపాటే. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అంపైర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం తోనే ఈ జరిమానా పడటం గమనార్హం. జరిమానా విధించడానికి కేఎల్ రాహుల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసారూ రిఫరీలు. ఏ కారణంతో కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉల్లంఘించారనే విషయాన్ని మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కు రావలసిన మ్యాచ్ ఫీజులో ఏకంగా 20 శాతం మేర కోత విధించేందుకు రిఫరీలు నిర్ణయించడం గమనార్హం. ఓటమి బాధలో ఉన్న కేఎల్ రాహుల్ కు పార్ధన నియమావళి ఉల్లంఘన కారణంగా జేబుకు చిల్లు పడింది అని చెప్పాలి. అంతేకాదు ఇక కేఎల్ రాహుల్ నిబంధనలు ఉల్లంఘించడం లెవెల్ 1 అఫెన్స్ గా అభివర్ణించారు రిఫరీలు. ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 163 పరుగులకే మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు చేరుకుంది..