ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లు మృతి... విషాదంలో ఫ్యాన్స్ ?

VAMSI
క్రికెట్ లో ఎందరో ఆటగాళ్లు వస్తూ ఉంటారు. తాము టీమ్ లో ఉన్నంత కాలం జట్టుకు తమ సామర్ధ్యానికి తగిన విధంగా సేవలను అందిస్తారు. అయితే క్రికెట్ ఆడేందుకు నిర్ణయించిన వయసు అయిపోయాక రిటైర్ అయిపోయి కొందరు వ్యాఖ్యాతలుగా, కోచ్ లుగా సేవలను అందిస్తారు. చాలా వరకు వ్యక్తిగత జీవితాలతో బిజీ అయిపోతూ ఉంటారు. అయితే అప్పటి వరకు ఆటగాళ్లపై విపరీతమైన అభిమానాన్ని, ప్రేమను పెంచుకున్న అభిమానాలు ఒకసారి వీళ్ళు రిటైర్ అయ్యాక ఆ కనెక్టివిటీ ని మిస్ అవుతారు. ఒకవేళ వాళ్ళు వ్యాఖ్యాతగానో లేదా కోచ్ గానో వస్తే మినహాయించి మిగిలిన వారిని మళ్ళీ చూసే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు.
అయితే మనము ఎంతగానో అభిమానించిన ప్రేమించిన ఆ క్రికెటర్ ఒకానొక రోజు మరణించారు అని తెలిస్తే? ఆ బాధను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. కానీ కొన్ని కఠిన సమయాలలో ఇలాంటివి అనుభవించక తప్పదు. అయితే ఆ రోజు ఇదే అని చెప్పాలి. ఈ రోజు ఒకే దేశానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు మరణించడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే వారెవరో ఇప్పుడు చూద్దాం.
బంగ్లాదేశ్ కి చెందిన మాజీ క్రికెటర్లుగా తెలుస్తోంది. ఒకరు సమియుర్ రెహ్మాన్ మరియు ఇంకొకరు మోషరప్ హుస్సేన్ లు, బాంగ్లాదేశ్ జట్టుకు విశేషమైన సేవలను అందించిన ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకే రకమైన వ్యాధితో మరణించడం జరిగింది. వీరిలో సమియుర్ రెహ్మాన్ బాంగ్లాదేశ్ మొట్టమొదటి వన్ డే టీమ్ లో సభ్యుడని తీరుస్తోంది. ఈయన 1986 వ సంవత్సరంలో ఆసియా కప్ ఆడిన టీమ్ లో ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడిన  సమియుర్ ఈ రోజు ఢాకాలో తన ఆఖరి శ్వాసను వదిలాడు. ఇక మోషారప్ హుస్సేన్ సైతం బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోవడం జరిగింది. ఈయన బంగ్లాదేశ్ తరపున 5 వన్ డే లు ఆడి ఉన్నారు. వీరిద్దరి మరణంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. వీరిని అభిమానించిన ఎందరో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: