షాకింగ్ : కోచ్ కి గుండెపోటు?
ప్రస్తుతం నెదర్లాండ్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ వికెట్కీపర్ రాన్ కాంప్బెల్ గుండెపోటుతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. తన పిల్లలతో కలిసి ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆయన. ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు గుండెపోటు వచ్చింది అని భావించి సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే రాన్ కాంప్బెల్ గుండెపోటు బారిన పడ్డారు అన్న విషయం తెలియడంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు.
కాగా ఆస్ట్రేలియా తరపున క్యాంప్బెల్ కొన్ని మ్యాచులు ఆడాడు. ఈ మాజీ క్రికెటర్ తొందరగా కోలుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు వరుసగా గుండెపోటు బారిన పడుతూ ఉండటం సంచలనంగా మారిపోతుంది. ఎన్ని రోజులనుంచి ఎంతో ఫిట్ గా ఉన్నవారు గుండెపోటు బారిన పడుతూ ప్రాణాలు పోతున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా నెదర్లాండ్ కోచ్ ఆస్ట్రేలియా మాజీ వికెట్కీపర్ రాన్ కాంప్ బెల్ కూడా గుండెపోటు బారిన పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది..