"కోల్కతా నైట్ రైడర్స్" ఓటమికి కారణం ఇదేనా?

VAMSI
గత రాత్రి ఐపిఎల్ లో కేకేఆర్ మరియు రాజస్థాన్ జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఇందులో కేకేఆర్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించింది. అదేంటి... గెలిపించింది అనుకుంటున్నారా? అవును ఇదే నిజం... ! నిన్న టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్ రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొదటి రెండు ఓవర్ లు మాత్రమే పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు రాజస్థాన్ ఓపెనర్లు. కానీ ఆ తర్వాత ఓవర్ నుండి కోల్కతా బౌలర్లపై ఇన్ ఫామ్ బ్యాట్స్మన్ బట్లర్ విరుచుకుపడ్డాడు. ఏ ఒక్క బౌలర్ నీ వదిలి పెట్టలేదు. గ్రౌండ్ కు నలు వైపులా షాట్ లు ఆడి కేకేఆర్ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. ఏ దశలోనూ రన్ రేట్ 10 కి తగ్గలేదు, ఇలా రాజస్థాన్ నిర్ణీత ఓవర్ లలో 217 పరుగులు భారీ టార్గెట్ ను కోల్కతా ముందు ఉంచింది.

ఈ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఓపెనర్ ఇన్ ఐపిఎల్ జాస్ బట్లర్ సీజన్ 15 లో రెండవ సెంచరీని నమోదు చేశాడు.   కేవలం 61 బంతుల్లో 9 ఫోర్లు మరియు 5 సిక్సర్ల సహాయంతో 103 పరుగులు చేశాడు. దీనితో ఆరంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే అనుకున్నారు. కానీ కోల్కతా అంత ఈజీ గా వదల్లేదు. చేజింగ్ కు వచ్చిన కోల్కతా మొదటి బంతికే సునీల్ నరైన్ వికెట్ ను కోల్పోయినా రెండవ బంతి నుండి ఎటాక్ చేసింది. ఓవర్ కు 10 పైనే పరుగులు చేస్తూ లక్ష్యానికి దగ్గర అవుతూ వచ్చింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మరియు ఫించ్ లు ఒక రేంజ్ లో రాజస్థాన్ ను ఆడుకున్నారు.

ఈ దశలో ఇద్దరూ అర్థ సెంచరీ లను నమోదు చేసుకున్నారు. ఇక కేకేఆర్ గెలుపు ఖాయం అనుకున్నారు అంతా... ఈ దశలో ఫించ్ వికెట్ తీసి ప్రసిద్ధ కృష్ణ కొంత భారాన్ని తగ్గించాడు. అప్పుడే మాయ జరిగింది ఆఖరి నాలుగు ఓవర్ లలో 40 పరుగులు చేస్తే చాలు చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. క్రీజులో శ్రేయస్ మరియు వెంకటేష్ లు ఉన్నారు. దీనితో కే కే ఆర్ దే విజయం అని అంతా అనుకున్నారు. కానీ 17 ఓవర్ వేసిన చాహల్ అద్భుతం చేశాడు మొదటి ఆ ఓవర్ లో కేవలం రెండు పరుగులు మాత్రం ఇచ్చి హ్యాట్రిక్ తో సహా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ ఓటమిని ఖాయం చేశాడు. కానీ బాధ్యతగా ఆడాల్సిన శ్రేయస్ మరియు వెంకటేష్ లు చాహల్ కు వికెట్ ఇచ్చేయడంతో కేకేఆర్ గెలుపు ఆశలు ఆవిరి అయ్యాయి. చాహల్ ఓవర్ నిదానంగా ఆడి ఉన్నా మిగిలిన మూడు ఓవర్లలో పరుగులు చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ వరుసగా నాలుగు వికెట్లు ఇచ్చేయడంతో రాజస్థాన్ గేమ్ లోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: