ఫామ్ లోకి వచ్చిన చెన్నై ఓపెనర్... ఇక "దంచుడే దంచుడు" !
కానీ ఈ మ్యాచ్ లో ఒక పాజిటివ్ చెన్నై కి అని చెప్పవచ్చు. వరుసగా అయిదు మ్యాచ్ లలో విఫలం అయిన రుతురాజ్ ఈ మ్యాచ్ లో మాత్రం మునుపటిలా ఫామ్ ను అందుకుని దుమ్ము దులిపాడు. మొదట టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఇంతకు ముందు మనము చెప్పినట్లుగానే రుతురాజ్ పవర్ ప్లే లో బాల్స్ వృధా అయినా తొందరపడకుండా తన ఇన్నింగ్స్ ను నిదానంగా ఆడాడు. నెమ్మది నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోవడానికి టైం తీసుకున్నాడు. ఇక ఒక్కసారిగా సెట్ అయ్యాక... తన బాదుడు మొదలు పెట్టాడు.
గుజరాత్ బౌలర్ లను ఎవరినీ వదిలి పెట్టలేదు. లెగ్ సైడ్ ను లక్ష్యం గా చేసుకుని రుతురాజ్ ఫోర్లు సిక్సర్ లతో విరుచుకుపడ్డాడు. ఈ ఒక్క విషయంలో చెన్నై జట్టు ఓడిపోయినా సంతోషపడింది. రుతురాజ్ తన ఇన్నింగ్స్ లో కేవలం 48 బంతుల్లో 73 పరుగులు చేసిన చెన్నై 169 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో మొత్తం 5 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక ముందు ముందు ఇదే దంచుడు కార్యక్రమం ఉంటుంది.