ఐపీఎల్ : టాప్ తెలిస్తే.. ఇక అంతే?

frame ఐపీఎల్ : టాప్ తెలిస్తే.. ఇక అంతే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కు పోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగే ప్రతి మ్యాచ్ ను కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. అయితే గత రెండు సీజన్ల లో నుంచి కూడా కరోనా వైరస్ కారణంగా భారత్ వేదిక గా కాకుండా యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అటు ప్రేక్షకులను కూడా ఎక్కడా స్టేడియం కి  అనుమతి ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈసారి మాత్రం భారత్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గడం తో భారత్ వేదికగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వేదికల లో కాకుండా కేవలం మహారాష్ట్రలోని కొన్ని స్టేడియం లలో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్ ను నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ. ఈ క్రమం లోనే ముంబై లోనే ఎక్కువ మ్యాచ్ లు జరుగు తున్నాయి అనే విషయం తెలుస్తుంది. ఇక ముంబైలోని స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్ల కెప్టెన్లు కూడా ప్రస్తుతం ఒకే బాటలో ముందుకు వెళ్తున్నారు.


 ఐపీఎల్ లో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్  కూడా ప్రస్తుతం బౌలింగ్ ఎంచుకుంటూ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు 25 మ్యాచ్ లలో టాస్ గెలిచిన అన్ని జట్లు కూడా బౌలింగ్ ఎంచుకున్నాయి.  ముంబై-పూణే లలో ఉన్న పిచ్ లలో ఛేజింగ్ కి మంచి అవకాశాలు ఉండడం తో ఇక టాస్ గెలిచిన జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించడం గమనార్హం. అంతే కాదు ఇక రెండవ సారి బ్యాటింగ్ చేసిన  జట్లే ఎక్కువగా విజయం సాధిస్తుండడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు సన్రైజర్స్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో టాస్ గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: