ధోని వికెట్ మర్చిపోలేని జ్ఞాపకం : చాహర్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో దిగ్గజ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ ఏ కెప్టెన్ కి  సాధ్యం కాని రీతిలో భారత జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత కేవలం మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రమే దక్కింది అని చెప్పాలి. అంతే కాదు ఎంతో ఒత్తిడిలో కూడా కూల్ గా కనిపిస్తూ మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం లో మహేంద్ర సింగ్ ధోని తర్వాతే ఇంకెవరైనా అని చెప్పాలి. వికెట్ల వెనకాల ఉంటూ రెప్పపాటుకాలంలో స్టంప్ అవుట్ చేస్తూ బ్యాట్స్మెన్లను పెవిలియన్ పంపించడంలో మహేంద్రసింగ్ ధోని దిట్ట. అంతేకాదు మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సూపర్ ఫినిషర్ అవతారమెత్తి మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు ధోని.


 ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్నాడు.  ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ వికెట్ పడగొట్టాలి అని అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు కలలుకంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో అవకాశం దక్కించుకునీ ఈ కలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ అనుకున్నట్లుగానే ధోని వికెట్ పడితే మాత్రం క్రికెటర్ల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.


 ఇప్పుడు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ కూడా ఇదే చెబుతున్నాడు 2020 ఐపీఎల్ సీజన్ లో  ధోని వికెట్ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని  అనుభూతి అంటూ రాహుల్ చహర్ తెలిపాడు. ధోని దిగ్గజ ఆటగాడు.. నేను 2020 ఐపీఎల్ సీజన్ లో ధోని ని మొదటిసారి అవుట్ చేశాను.  ఇక ఆ క్షణంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మాటల్లో వర్ణించలేను. అది ఒక మరిచిపోలేని జ్ఞాపకం. ధోనీ క్రీజులో ఉన్నాడు అంటే బౌలర్ ఎప్పుడు ఆందోళనకరంగానే ఉంటాడు.. ఎప్పుడైతే ధోని అవుట్ అవుతాడో అప్పుడు కాస్త ఫ్రీగా ఫీల్ అవుతాడు. నేను కూడా అంతే అంటూ రాహుల్ చహర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: