శిఖర్ ధావన్ గురించి అప్పుడే తెలిసింది : మహమ్మద్ కైఫ్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది అంటే చాలు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంతమంది ఐపీఎల్ గురించి ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల గురించి పలు విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా ఇదే చేశాడు. గతంలో ఢిల్లీ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాడు మహమ్మద్ కైఫ్. ఇక ఇటీవల ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన మహ్మద్ కైఫ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


 గత ఏడాది ఢిల్లీ జట్టులో ప్రాక్టీస్ గేమ్ జరుగుతున్న సమయంలో స్టయినిస్ బౌలింగ్ చేస్తూ ఉంటే శిఖర్ ధావన్ క్రీజులో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అంపైర్  గా చేస్తూ ఉన్నా ఒక బంతికి దావన్ సింగిల్ తీసి నాన్ స్ట్రైకర్ వైపు రాగానే స్టయినిస్ అతని వద్దకు వెళ్లి ఫీలింగ్ లో ఏమైనా మార్పులు చేయాలా అని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన శిఖర్ ధావన్ ఇప్పుడున్న ఫీలింగే ఉండనివ్వు పర్వాలేదు అంటూ బదులిచ్చాడు. ఇక అప్పుడు స్టయినిస్ బౌలింగ్ చేసేందుకు వెళ్లగా ఇక ధావన్ నా వైపు తిరిగి నా బలహీనత గురించి తనకు ఎందుకు చెబుతా.. తర్వాత ప్రపంచకప్ ఆడాలి అప్పుడు నా బలహీనత ఉందని అతనికి ఎందుకు చెప్పాలి అంటూ నాతో చెప్పాడు అంటూ మహమ్మద్ కైఫ్  వెల్లడించాడు.



 అప్పుడు శిఖర్ ధావన్ ఎంత తెలివైన వాడో అర్థమైంది అంటూ తెలిపాడు. ఓకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నప్పటికి ఆటగాళ్లు తమ బలహీనతలను ఇతరులతో పంచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరని అప్పుడే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆరోజు శిఖర్ ధావన్ తనకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలో కావాలనే చెప్పలేదు ఎందుకంటే తన బలహీనతలను చెప్పుకుంటే అంతర్జాతీయ  క్రికెట్ లో తమపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది అనే విషయాన్ని ముందుగానే పసిగట్టాడు.. అయితే స్టయిలిష్ శిఖర్ ధావన్ ఆట పరంగా మంచి స్నేహితులు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు మహమ్మద్ కైఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: