అశ్విన్ మరో సెన్సేషన్.. అప్పుడు మన్కడింగ్.. ఇప్పుడు?

praveen
రవిచంద్రన్ అశ్విన్.. ప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ బౌలర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు లో ఎంతో మంది స్పిన్నర్లు ఉన్నప్పటికీ అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎంతో భిన్నం  కేవలం స్పిన్ బౌలింగ్ చేయడమే కాదు తన బౌలింగ్లో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ బ్యాట్స్మెన్లను తికమక పెట్టడంలో అశ్విన్ దిట్ట అనే చెప్పాలి. అందుకే రవిచంద్రన్ అశ్విన్ ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని కూడా అంటూ ఉంటారు. అవసరాన్ని బట్టి అటు తన బౌలింగ్ శైలిని మార్చుకుంటూ ఇప్పటివరకు ఎన్నో సార్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు రవిచంద్రన్ అశ్విన్.



 ఇకపోతే మొన్నటివరకు ఢిల్లీ కాపిటల్స్ జట్టులో కొనసాగిన రవిచంద్రన్ అశ్విన్ ఇక వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతని వదిలేయడంతో ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు అతని కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తన తోటి బౌలర్ అయిన యుజ్వేంద్ర చాహల్ తో కలిసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు అశ్విన్. అయితే అశ్విన్ ఎప్పుడూ ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రపంచ క్రికెట్ లో మొట్టమొదటి సారి మన్కడింగ్ విధానం లో వికెట్ తీసి వార్తల్లో సెన్సేషన్ గా మారిపోయాడు.


 రూల్స్ ప్రకారమే రవిచంద్రన్ అశ్విన్ అలా వికెట్ తీశాడు అని కొంతమంది అంటే రవిచంద్రన్ అశ్విన్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు అంటూ మరికొంతమంది తిట్టిపోశారు. ఇక అప్పట్లో పంజాబ్కు ఆడుతూ రాజస్థాన్ బ్యాట్స్మెన్లను మన్కడింగ్ కీ పాల్పడిన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇప్పుడు రిటైర్డ్ ఔట్ గా మరోసారి సెన్సేషన్ సృష్టించాడు. బౌలర్  బంతి వేయకముందే బ్యాట్స్మెన్ క్రీజు దాటినప్పుడు అవుట్ చేసే విధానం మన్కాడింగ్ అంటారు. అంపైర్ అనుమతి లేకుండానే ఔట్ గా ప్రకటించుకుని పెవిలియన్ చేరడాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు ఇటీవలే పరాగ్ కు ఛాన్స్ ఇచ్చేందుకు ఇలా రిటైర్డ్ అవుట్ గా వెనుతిరిగాడు రవిచంద్రన్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: