హమ్మయ్య.. ఐపీఎల్ లో పెద్ద ప్రమాదం తప్పింది.. వైరల్ వీడియో?

praveen
ఇటీవల ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు హ్యాట్రిక్ విజయం తో రికార్డు సృష్టించగా ముంబై ఇండియన్స్ మాత్రం ఇక ఐపీఎల్ సీజన్లో వరుసగా నాలుగు ఓటమిని నమోదు చేసింది అని చెప్పాలి. అయితే 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో అలవోకగా టార్గెట్ చేదించింది. అయితే ముంబై బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం అవడంతో ఇక ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు అనే చెప్పాలి.


 అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ అనుజ్ రావత్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలోనూ డూప్లేసెస్ అనుజ్ రావత్ నిలకడగా ఆడుతూ ఉన్నారు. ఇన్నింగ్స్ 8 ఓవర్లో కిరణ్ పోలార్డ్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. ఇక ఆ ఓవర్ లో రెండో బంతిని అనూజ్ రావత్ బ్యాక్వర్డ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలోనే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న డుప్లెసిస్ సింగిల్ కు కాల్ ఇవ్వడంతో అనూజ్ పరుగు పెట్టాడు. ఇంతలో ముంబై ఇండియన్స్ ఫీల్డర్ పోలార్డ్ కి బంతిని త్రో విసిరాడు. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో అటు కిరణ్ పోలార్డ్ అనుజ్ రావత్ పరిగెత్తుతున్న వైపు వచ్చాడు



 దీంతో పరుగులు పెడుతున్న అనూజ్ రావత్  పోలార్డ్ ను గమనించలేదు. దీంతో ఒకరిని ఒకరు బలంగా ఢీ కొట్టుకున్నారు. అనుజ్ రావత్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే హెల్మెట్ గ్రౌండ్ కి బలంగా గుద్దుకుంది. దీంతో అతనికి గాయం అయింది అని అందరూ అనుకున్నారు. ఇక అనుజ్ రావత్ కొద్దిసేపు అలాగే పడుకుండి పోయాడు. ఆ తర్వాత పోలార్డ్ అతని వద్దకు వచ్చి బాగానే ఉంది కదా అని అడిగాడు. దానికి అనుజ్ రావత్ ఐ యాం ఫైన్ అంటూ సమాధానం చెప్పి పైకి లేచాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  దేవుడి దయవల్ల తృటిలో ప్రమాదం తప్పింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: