రాసిపెట్టి ఉండాలంతే.. ఆ రికార్డు అతనికే సాధ్యమైంది?
పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మాత్రం మీరు అలా అనుకోరు. వివరాల్లోకి వెళితే 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు అలెక్స్ స్టివార్ట్. 14 ఏళ్లపాటు ఇంగ్లాండ్ క్రికెట్ కీలక పాత్ర వహించాడు. బ్యాట్స్మెన్గా వికెట్ కీపర్గా సేవలందించిన అలెక్స్ స్టివార్ట్ ఇంగ్లాండ్ కెప్టెన్ గా కూడా పని చేసి అద్భుతమైన ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఇక 133 టెస్టుల్లో ఏకంగా 8473 పరుగులు చేశాడు. 170 వన్డేల్లో 4677 పరుగులు చేశాడు. అయితే ఈ మాజీ ఆటగాడు పుట్టింది 1963 ఏప్రిల్ ఎనిమిదవ తేదీన. ఇప్పుడు వరకు ఎంతోమంది స్టార్ ప్లేయర్లు తమ ఆటతీరుతో తమ బౌలింగ్తో అరుదైన రికార్డులు సాధిస్తే.. అలెక్స్ స్టివార్ట్ మాత్రం తన పుట్టిన రోజుతోనే అరుదైన రికార్డు సాధించాడు.
టెస్టుల్లో అలెక్స్ స్టీవార్ట్ చేసింది 8463 పరుగులు. అతని బర్త్ డే లో కూడా అదే సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి క్షుణ్ణంగా పరిశీలిస్తే అలెక్స్ స్టివార్ట్ పుట్టిన తారీకు 8 ఇక పుట్టిన నెల 4 పుట్టిన సంవత్సరం 63 అన్నింటినీ కలిపి చూస్తే అలెక్స్ స్టివార్ట్ టెస్టుల్లో చేసిన పరుగులు మ్యాచ్ అవుతూ ఉంటాయ్. ఇదే విషయాన్ని ఇటీవల ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అలెక్స్ స్టివార్ట్ కి విషెస్ చెప్పింది. ఈ మాజీ ఆటగాడు రిటైర్ అయ్యే సమయానికి టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించి ఉన్నాడు. ఇక మరిన్ని రికార్డులు ఈ ఆటగాడి పేరిట ఉండటం గమనార్హం.