చెన్నై కి దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ దూరం?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్  జట్టుకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఎక్కువసార్లు ఫైనల్ ఆడిన జట్టుగా  చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతోంది. అంతే కాకుండా ఏకంగా నాలుగు సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా కూడా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఈ ఏడాది మరో సారి టైటిల్ విజేత గా నిలిచి ఏకంగా ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు గా రికార్డు సృష్టించాలని అనుకుంది.

 కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఘోర పరాభవాన్ని చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోనీ సేన ఏకంగా 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక ఓటమి పాలయింది. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలా వరుస ఓటములతో కంటిమీద కునుకు లేని సమయంలో ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది.

 ఇప్పటికే కోట్లు కుమ్మరించి కొనుక్కున్న దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టు దూరమయ్యాడు. అతను జట్టు చేరడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు డెత్ ఓవర్ స్పెషలిస్టుల కొనసాగుతున్న బౌలర్ జోర్ధన్  ట్రాన్సిల్ కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు అన్నది తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి టాన్సిల్స్ తో బాధపడుతున్న జోర్ధన్ కు ఇన్ఫెక్షన్స్ అధికం కావడంతో చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడట. మరోవైపు విదేశీ పేసర్ ఆడమ్ మిల్నే పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే అలాగే ఉంది. ఇలా రేపు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇలా వరుసగా ఆటగాళ్లు గాయాల బారినపడి దూరం అవుతు ఉండటం మాత్రం కలవరపెడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk

సంబంధిత వార్తలు: