ఐపీఎల్ లో మోసం.. ఆటగాళ్లకు నకిలీ ట్రోపీ?

praveen
బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత ప్రత్యేకత ఉందొ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా దేశీయ క్రికెట్ లీగ్ నిర్వహిస్థాయి. కానీ అన్ని దేశాల ఆటగాళ్లు ఆడాలనుకునేది  మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడితే అటు ఒకవైపు ఆదాయంతో పాటు మరోవైపు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి. అంతకు మించి అద్భుతమైన అనుభవాన్ని కూడా సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత ఊరుకుంటారా ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటూ తిరుగులేని దేశీయ లీగ్ గా మారిపోయింది. అంతే కాదు ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అన్ని విషయాలు మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ కొన్ని విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐపీఎల్  ట్రోఫీకి గమనించిన ఒక విషయం చాలామందికి తెలియదు. సాధారణంగా ఐపీఎల్  గెలిచిన జట్టుకు కప్పు ఇస్తూ ఉంటారు.

 అయితే ఇలా గెలిచిన జట్టుకు ఇచ్చే ఐపీఎల్ ట్రోఫీ నిజమైనది కాదు  ఫేక్ అన్నది చాలామందికి తెలియదు   సాధారణంగా ఐపీఎల్ ట్రోఫీ 24 క్యారెట్ల బంగారం తో తయారు చేస్తారు. వజ్రాల పొదుగు కూడా ఉంటుంది. దీని విలువ కోట్ల లోనే ఉంటుంది. అయితే ఇక ఏదైనా జట్టు కప్ గెలిచినప్పుడు మొదట కెప్టెన్ కు అందించేది నిజమైన ట్రోఫీ. కానీ ఆ తర్వాత జట్టు ఆటగాళ్లు అందరూ కూడా ఫోటోలు దిగేది మాత్రం నకిలీ ట్రోఫీ. ఎందుకంటే ఇక జట్టు కెప్టెన్ నిజమైన ట్రోఫీతో ఫోటో దిగిన తర్వాత మళ్లీ బీసీసీఐ వెనక్కి తీసుకుంటుంది. అయితే దానిపై గెలిచిన జట్టు పేరును ముద్రిస్తూ  ఉంటుంది. నకిలీ ట్రోఫీ ఆటగాళ్లు ఇవ్వడంతో అదే ట్రోఫీతో అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. అంతే కాకుండా  ఒకేసారి రెండు మ్యాచ్లు జరిగినప్పుడు రెండు మ్యాచ్ లలో కూడా ఐపీఎల్ ట్రోఫీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రెండూ ట్రోఫీలు కూడా నిజమైనవి కాదు నకిలీ అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: