వరల్డ్ కప్: సఫారీలను చిత్తు చేసి ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ !
ఈ రోజు జరిగిన రెండవ సెమీఫైనల్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. మొదట టాస్ గెలిచిన సఫారీలు ఎప్పటి లాగే ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా ముందు అసాధ్యమైన టార్గెట్ ను ఉంచింది. అయితే ఈ స్కోర్ ను సాధించడం ఎంత కష్టమో తెలిసిందే. అది కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉన్న ఇంగ్లాండ్ ను తట్టుకుని పరుగులు చేయడం సవాలుతో కూడుకున్న పని. సరిగ్గా అలానే జరిగింది. సౌత్ ఆఫ్రికా 294 పరుగుల లక్ష్య సాధనలో ఏ దశలోనూ టార్గెట్ ఛేదించడం కాదు కదా? కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ టోర్నీ మొత్తం ఆకట్టుకున్న ఓపెనర్ లారా కూడా ఈ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ బౌలర్ ల ధాటికి 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ సోపీ అయిదు 6 వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లు వరల్డ్ కప్ 2022 టైటిల్ కోసం తలపడనున్నాయి.