జెర్సీ మారింది.. ప్లేయర్స్ మారారు.. కానీ ఆటతీరు మారలేదు?

praveen
ప్రతి సీజన్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతుంది. కానీ ఏం లాభం ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఎప్పుడూ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంటుంది. సాధారణంగా క్రికెట్ అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం. కానీ సన్రైజర్స్  మాత్రం ప్రత్యర్థులకు ఎక్కడ పోటీ ఇవ్వలేక ఘోర ఓటమిని చవి చూస్తూ ఉంటుంది. దీంతో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ కు అభిమానులు అందరూ కూడా ప్రతి మ్యాచ్ లో కూడా నిరాశ లో మునిగి పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ ఇక 2022 సీజన్లో మాత్రం అలా కాదు ఎందుకంటే జట్టులోకి ఎంతో మంది వచ్చారు.. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జెర్సీ కూడా పూర్తిగా మారిపోయింది.


 ఇప్పటికీ కెప్టెన్గా అంతర్జాతీయ క్రికెట్ లో మంచి గుర్తింపు సంపాదించిన కేన్ విలియం సన్ సన్రైజర్స్ హైదరాబాద్ ను నడిపిస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ఇక సన్రైజర్స్ ఈసారి సత్తా చాటాడం ఖాయం.. కప్ గెలవడం పక్క అంటూ ధీమాతో ఉన్నారు తెలుగు ప్రేక్షకులందరూ కూడా. ఇక మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎలా రాణించ పోతుందో అని నిన్న జరిగిన మ్యాచ్ సమయంలో  టీవీలకు అతుక్కుపోయి మరి చూశారు. కానీ సన్ రైజర్స్ బాగా రాణించడం కాదు ప్రత్యర్థి రాజస్థాన్కు ఎక్కడ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. దీంతో మళ్లీ అభిమానులకు నిరాశ తప్పలేదు అని చెప్పాలి.


 జట్టులో ఎంతో మంది ప్లేయర్లు మారినా జెర్సీ మారినా ఇక ఐపీఎల్ లో సన్రైజర్స్ ఆటతీరు మాత్రం అస్సలు మారడం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్య ఛేదనకోసం బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఒకానొక సమయంలో 37 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ ఆ తర్వాత మార్కరం 57 పరుగులు షేఫర్డ్ 24 పరుగులతో స్కోరును పరుగులు పట్టించడం తో చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేయగలిగింది. దీంతో ఏకంగా 61 పరుగుల తేడాతో రాజస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది సన్రైజర్స్ టీం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: