అతను నా వికెట్ తీశాడు.. నేను సంతోషం : హార్దిక్ పాండ్యా
ఇకపోతే ఇటీవల ఈ మ్యాచ్ కు సంబంధించిన విశేషాలను చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. నిజానికి షమి అద్భుతమైన ప్రతిభతో మంచి ప్రారంభాన్ని అందించాడు అంటూ చెప్పుకొచ్చాడు. నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఒత్తిడిని జయించగలను. ఇక నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే మిగతా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది అంటూ హార్థిక్ పాండ్య అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎవరో ఒకరి మీద ఆధారపడటం కంటే జట్టు మొత్తం సమిష్టి కృషితో ముందుకు సాగుతున్నాను అంటూ హార్దిక్ పాండ్య తెలిపాడు.
అదే సమయంలో ఇక గుజరాత్ లక్నో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను వికెట్ తీసినా అతని సోదరుడు కృనాల్ పాండ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హార్దిక్ పాండ్యా. గతంలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఈ అన్నదమ్ములు ఇక ప్రస్తుతం వేరువేరు జట్లకు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండే వికెట్ తీశాడు కృనాల్ పాండ్య. అయితే ఇక వికెట్ తీసి కృనాల్ పాండ్యా విజయం సాధిస్తే ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా విజయం అందించి నేను విజయం సాధించానాని దీంతో ఇక కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది అంటూ చమత్కరించాడు హార్దిక్ పాండ్య.