పంజాబ్ విజయం వెనుక.. ఆ సినిమా ప్రభావం ఉందట?
అయితే ఈ రేంజి భారీ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమని ఇక పంజాబ్ కింగ్స్ ఓటమి తథ్యం అని ఎంతో మంది భావించారు. కానీ ఊహించని రీతిలో కొండంత లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించింది పంజాబ్ కింగ్స్ జట్టు. పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగులు సాధించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32,శిఖర్ధావన్ 43, భాను క రాజు కప్ప 43, లివింగ్ స్టోన్ 19, షారుక్ ఖాన్ 24 మంచి బ్యాటింగ్ చేశారు. ఇక చివర్లో వచ్చిన ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో 25 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.
అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా రాణించడానికి పరుగుల వరద పారించడానికి ఒక సినిమా కారణం అన్నది తెలుస్తుంది. 14 పిక్స్ అనే నేపాలి ఇంగ్లీష్ మూవీ ని చూశారట. నథింగ్ ఇంపాజిబుల్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ మూవీ పంజాబ్ ఆటగాళ్లు ఎంతగానో స్ఫూర్తిని రగిలించింది అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించటం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ సినిమా ను జట్టు కోచ్ అనిల్ కుంబ్లే ప్రత్యేకంగా చూపించాడని ఇక ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తి తోనే భారీ టార్గెట్ ను కూడా అనాయాసంగా ఛేదించగలిగాము అంటూ చెప్పుకొచ్చాడు స్మిత్..