కామెంటర్ హర్ష భోగ్లే పై దాడి.. వైరల్ వీడియో?
ఇక ఎవరైనా బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే దానిని ప్రేక్షకులందరికీ చేరే విధంగా చెబుతూ ఉంటారు. ఇలా తన కామెంట్రీ తోనే మ్యాచ్ కి ప్రాణం పోస్తూ ఉంటారు ఎంతోమంది. అలాంటి వారిలో హర్ష భోగ్లే కూడా ఒకరు. ప్రస్తుతం ప్రముఖ కామెంటేటర్ లలో ఒకరిగా కొనసాగుతున్నారు హర్ష భోగ్లే. ఇకపోతే ఇప్పుడు హర్షా భోగ్లే కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. క్రికెటర్లకు సంబంధించిన వార్త లాగానే హర్షా భోగ్లే కు సంబంధించిన వార్త కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ముంబై పోలీసులు వెంటనే స్పందించి ఆయన ఆస్పత్రిలో చేర్పించారు అని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లైవ్ లో క్రికెట్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇక హర్ష భోగ్లే పై దాడి జరిగింది. అదంతా వీడియోలో రికార్డు అయింది. అయితే ఇక హర్ష భోగ్లే పై ఎవరు దాడి చేశారు అన్న దానిపై మాత్రం వివరాలు తెలియాల్సి ఉంది. హర్ష భోగ్లే కు ఏమైందో సమాచారం లేదని ఆయన తో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలిపింది..