
వరల్డ్ కప్: ఇంగ్లాండ్ ఆశలు సజీవం... ఒక్క గెలుపు దూరంలో సెమీస్?
దీనితో వెస్ట్ ఇండీస్ 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. అదే విధంగా ఈ రోజు జరిగిన రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించి సెమీస్ అవకాశాలను మరింత పెంచుకుంది. ఇక మిగిలిన ఒక్క మ్యాచ్ లో కనుక ఇంగ్లాండ్ గెలిస్తే డైరెక్ట్ గా ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఆఖరి మ్యాచ్ లో ఓడితే... ఇప్పటికే 7 పాయింట్ల తో ఉన్న వెస్ట్ ఇండీస్ సెమీస్ కు చేరుకుంటుంది. దీనిని బట్టి చూస్తే తర్వాత ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్లు ఆడబోయే ఆఖరి మ్యాచ్ ఫలితాన్ని బట్టి సెమీస్ కు చేరబోయే 2 జట్లు కన్ఫర్మ్ కానున్నాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు మంచి ఊపుమీదున్నాయి. ఈ రెండింటితో కలిసి అదే మరో రెండు జట్లు ఏవి అన్న విషయంపై సందిగ్దత ఇంకా తొలగిపోలేదు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.