కోల్కతా అతనికి కెప్టెన్సీ ఇచ్చి.. మంచి పని చేసింది : డేవిడ్ హస్సీ

praveen
శ్రేయస్ అయ్యర్... ఇటీవలి కాలంలో టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోతున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. సెంచరీలతో చెలరేగి పోతున్నాడు శ్రేయస్ అయ్యర్. దీంతో గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో అతని పేరు మార్మోగిపోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం మంచి ఆటగాడిగా పేరు సంపాదించుకున్న శ్రేయాస్ ఇప్పటికే తన కెప్టెన్సీ తో కూడా మంచి  గుర్తింపు సంపాదించాడు అన్న విషయం తెలిసిందే.


 గతంలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించాడు. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్ లేకపోయినప్పటికీ ఏకంగా ఐపీఎల్ లో దిగ్గజ జట్లుగా ఉన్నావారిని ఓడిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లకలిగాడు.  కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ కోల్పోయాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతన్ని మెగా వేలంలో కి వదిలేయడంతో కోల్కతా నైట్రైడర్స్ తన సొంతం చేసుకుంది. అంతే కాదు అతనికి కెప్టెన్సీ అనుభవం ఉండడంతో కెప్టెన్సీ కూడా అప్పగించింది.


 ఈ క్రమంలోనే ఇక శ్రేయస్ అయ్యర్  కొత్త కెప్టెన్సీలో  ఇక కోల్కతా ప్రస్థానం ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ సామర్థ్యంపై ఇటీవలే కోల్కత్తా మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్ సహజంగానే గొప్ప నాయకుడు అంటూ పేర్కొన్నాడు ఆయన. ఇక ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న అతనికి మరింత స్వేచ్ఛ ఇస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటపై అతనికి మంచి అవగాహన ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడిని కెప్టెన్ గా నియమించడం కోల్కతా యాజమాన్యం తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం శ్రేయస్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు అంటూ కోల్కతా మెంటల్ మైకెల్ హస్సీ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: