చెన్నై కొత్త జెర్సీ చూసారా.. అదిరిపోయింది?

praveen
బీసీసీఐ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోందన్న విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో కేవలం 8 జట్లు మాత్రమే ఐపీఎల్లో తలపడ్డాయ్. కానీ ఈసారి గుజరాత్, లక్నో జట్లు కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఇక రోజురోజుకి ఐపీఎల్పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.. మార్చి 26వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ జరగబోతోంది. ఇక పోతే ఇక అనూహ్యమైన మార్పులతో అన్నీ జట్లు బరిలోకి దిగబోతున్నాయి.


 ఐపీఎల్ 2022 సీజన్ కోసం అన్ని జట్లు కూడా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కొత్త జెర్సీ సంబంధించిన విషయాలను ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. అయితే ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తమ కొత్త జెర్సీ కి సంబంధించిన వివరాలను ఫోటోలను ఇప్పటివరకు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో అభిమానులు అందరూ ఇక ఎప్పుడెప్పుడు కొత్త జెర్సీ విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.


 ఇక ఇప్పుడు కొత్త జెర్సీ  విడుదల అవుతుంది అని తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఇటీవల సోషల్ మీడియాలో కొత్త జెర్సీ ఆవిష్కరించింది చెన్నై. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆటగాడు రుతురాజ్  కొత్త జెర్సీ ధరించి ఉన్న ఒక వీడియో ని యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. భారత సాయుధ దళాలకు గుర్తుగా గత ఏడాది చెన్నై జెర్సీ పై ఆర్మీ దుస్తులను ముద్రించింది  ఇక ఇప్పుడు కొత్తగా చెన్నై జట్టు 4 ట్రోఫీ లు సాధించిన దానికి గుర్తుగా ప్రాంఛైజీలు జెర్సీ పై 4 నక్షత్రాలు ముద్రించింది  దీనిపై సీఎస్కే ప్రధాన స్పాన్సర్ టీవీఎస్ యూరోగ్రిప్ లోగో కూడా ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: