చిల్ అవుతున్న ముంబై టీం.. వీడియో వైరల్?
ఇకపోతే అందరు ఆటగాళ్లు జట్టు క్యాంపులో చేరిపోవడంతో ఇక ఆయా జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆటగాళ్లలో ఉన్న మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు ముంబై ఇండియన్స్ సైతం తమ కార్యాచరణ ప్రారంభించింది. బయో బబుల్ కారణంగా ఆటగాళ్ల లో ఏర్పడిన మానసిక ఒత్తిడిని పోగొట్టి ఉల్లాసంగా ఉండేలా చేసేందుకు ఎన్నో వినూత్నమైన వినోదభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఏకంగా బయో బబుల్ ఉండడానికి ఉండటానికి కాదు టూర్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో అన్న విధంగా వినోదభరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అందరూ కూడా చిల్ అవుతున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఇక ఇందులో జట్టు సిబ్బందితోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ మిగతా ఆటగాళ్లు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో ఆటగాళ్లు అందరూ కూడా సరదాగా గడిపేందుకు ఇక కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తుంది. ఇక ముంబై జట్టులోని ఆటగాళ్ళు అందరిని కూడా కొన్ని టీమ్స్ గా విభజించి ఫన్నీ గేమ్స్ ఆడించబోతున్నారు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.