అతనికి ఇద్దరు పిల్లలు.. అయినా ఆ క్రికెటర్ ఏం చేశాడంటే?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. దీంతో మొన్నటి వరకూ భారత జట్టుకు ప్రత్యర్థులుగా ఆడిన ఆటగాళ్లందరూ ఇక ఇప్పుడు భారత్లో ప్రాంతీయ జట్లలో ఆడటానికి సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే  ఎంతోమంది భారత్ చేరుకున్నారు. ఇక మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశీ క్రికెటర్లు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకునీ ఈ మెగా లీగ్ లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు ఏమో అని అనిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాక్స్వెల్ తన భారత ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు.


 ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ టీమ్ సౌథి మాక్స్వెల్ బాటలోనే నడిచాడు. 33 ఏళ్ల వయసులో చాలా కాలంగా ప్రేమిస్తున్నా బ్రయ ను సౌదీ ఇటీవలే పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు టిమ్ సౌదీ. అయితే చాలా కాలంగా ఈ స్టార్ క్రికెటర్ బ్రయా తో లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగుతూ ఉన్నారు. అయితే పెళ్లి కాకుండా ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇక దాదాపు కొన్నేళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. తమ రిలేషన్ షిప్ లో మరో అడుగు ముందుకేసి ఇక వివాహం చేసుకున్నారు.



 ఇకపోతే టిమ్ సౌథీ ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ 2008లో అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 85 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సౌదీ 338 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతని 1.5 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: