హిస్టరీ క్రియేట్ చేసిన రోహిత్.. క్రికెట్ లో ఒకే ఒక్కడు?

praveen
రోహిత్ శర్మ ఒకప్పుడు టీమిండియాలో సీనియర్ ఆటగాడు. స్టార్ ఓపెనర్.. ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్.. అయితే ఇప్పటికే తన కెప్టెన్సీని సామర్ధ్యం ఏమిటి అన్న విషయాన్ని ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా ముందుకు నడిపించి నిరూపించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ సమయంలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇటీవల అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీమిండియాకు మూడు ఫార్మాట్లకు  బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ పట్టుకున్న దల్ల బంగారం అవుతుంది.


 రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించిన ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా విజయం సాధిస్తోంది. అది కూడా మామూలు విషయం కాదు ఏకంగా రికార్డులు కొల్లగొట్టే విజయాలు సాధిస్తు టీమిండియా దూసుకుపోతుంది. టీ20 వన్డే ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్ అనే తేడా లేదు ఇక అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ ప్రత్యర్థులపై తనదైన వ్యూహాలతో పైచేయి సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పుడు వరకు టీమ్ ఇండియా ఆడిన అన్ని మ్యాచ్ లలో కూడా గెలిచింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో కూడా ప్రత్యర్థి శ్రీలంక ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.



 ఫుల్ టైం కెప్టెన్గా అరంగేట్రం సిరీస్ లలోనే మూడు ఫార్మాట్లలో కూడా క్లీన్స్వీప్ విజయాలు సాధించిన తొలి సారధిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. కోహ్లీ నుండి ఫుల్ టైమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్ రెండో వన్డే 3-0,టి20 సిరీస్ 3-0 క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేనా.. తాజాగా శ్రీలంక తో టెస్టు సిరీస్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇలా అరంగేట్ర సిరీస్లో వరుసగా మూడు ఫార్మాట్లలో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన మొట్టమొదటి కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఇక ఇటీవల బెంగళూరు వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో ఏకంగా 239 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: