
రోహిత్ నన్ను భయపెట్టాడు : గంభీర్
ప్రతి ఒక ఆటగాడి లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతు జుట్టుకు ఎంతో అద్భుతమైన విజయాలు అందించారు. ఐపీఎల్లో కేవలం తక్కువ సమయం లోనే ఐదు సార్లు జట్టును టైటిల్ విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్ గా ఎంతో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా తమ జట్టు ఐదు సార్లు టైటిల్ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ క్రమం లోనే రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎప్పటి నుంచొ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల టీమిండియా సారథిగా కూడా ఓటమి లేకుండా దూసుకు పోతున్న రోహిత్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండ లేకపోతున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ కోల్కతా నైట్రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్ర లో రోహిత్ శర్మ ను మించిన కెప్టెన్ లేడని గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. తాను ఐపీఎల్లో సారథిగా ఉన్న సమయం లో నిద్రలేని రాత్రులను తనకు మిగిల్చాడు రోహిత్ శర్మ. గేల్ డివిలియర్స్ ఇతర స్టార్ ప్లేయర్లకు నేను ఎప్పుడూ భయ పడలేదు రోహిత్ శర్మ ఒక్కడే నన్ను భయపెట్టి నిద్ర లేకుండా చేశాడు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు..