మయాంక్.. నీకది గుర్తు ఉంది కదా : గంభీర్
అయితే అతను జట్టులో కొనసాగాలి అంటే ఇక ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ భారీ పరుగులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో మయాంక్ అగర్వాల్ ప్రదర్శన పై స్పందించిన భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. భారీ స్కోర్లు చేయకపోతే జట్టులో స్థానం ఉండదు అన్న విషయం మయాంక్ అగర్వాల్ కు తెలుసు అంటూ కామెంట్ చేశాడు గౌతం గంభీర్. అతడు శ్రీలంకతో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగులకే మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు.
ఇక 33 పరుగులతో దూకుడుగా వెళుతున్న సమయం లో క్రీజ్లో పాతుకు పోయి ఆడుతున్నాడని అందరూ అనుకుంటున్న సమయం లో శ్రీలంక స్పిన్నర్ కు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నా మయాంక్ అగర్వాల్ చివరికి స్పిన్నర్ కు వికెట్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే స్పందించిన గౌతం గంభీర్ ఎప్పుడైతే కె.ఎల్.రాహుల్ జట్టులోకి వస్తాడో.. అప్పుడు నీకు జట్టులో స్థానం ఉంటుందని భరోసా లేదు. అందుకే భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆ విషయం నీకు తెలుసు కదా అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు..