కెప్టెన్ అయ్యాక రోహిత్ లో దూకుడు తగ్గిందా?

VAMSI
ప్రస్తుతం టీమ్ ఇండియా వరుస సీరీస్ విజయాలతో సంబరాల్లో ఉంది. మొదట వెస్ట్ ఇండీస్ తో మొదలైన వన్ డే మరియు టీ 20 సీరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక ను టీ 20 సీరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది. ఏ దశలోనూ శ్రీలంకలో పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ విజయాలు అన్నీ కూడా ఊరకే రాలేదు. సరైన జట్టు కూర్పు, ఆటగాళ్ళ మధ్య సమన్వయం మరియు మద్దతు, ముఖ్యంగా నాయకుడుగా రోహిత్ సామర్థ్యం ఇవన్నీ కలగలిపి టీమ్ ఇండియా వరుస విజయాలను అందుకోవడంలో కారణం అయ్యాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా కు మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

ఎందుకంటే తాను కెప్టెన్ గా వచ్చిన వెస్ట్ ఇండీస్ సిరీస్ నుండి రోహిత్ బ్యాటింగ్ ప్రదర్శన చూసుకుంటే ఏమంత గొప్పగా లేదు.  వెస్ట్ ఇండీస్ తో మొదటి వన్ డే లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మళ్ళీ రెండవ వన్ డే లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక మూడావ్ వన్ డే లోనూ ఏమాత్రం మారకుండా 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ విధంగా మొత్తం మూడు వన్ డే లలో కలిపి 78 పరుగులు చేశాడు.

కనీసం టీ 20 లో అయినా మెరుస్తాడు అనుకునే, అది కూడా మొదటి టీ 20 లో 40 పరుగుల వరకే పరిమితం అయింది. రెండవ టీ 20 లో 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  మూడవ టీ 20 లో 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.  మొత్తం మూడు టీ 20 లలో కలిపి 66 పరుగులు మాత్రమే చేసి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక శ్రీలంకతో మొదలైన మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లోనూ వరుసగా 44 , 1 మరియు 5 పరుగులు చేసాడు.

రోహిత్ శర్మ వెస్ట్ ఇండీస్ మరియు శ్రీలంక సీరీస్ లలో మొత్తం మూడు వన్ డే లు మరియు 6 టీ 20 లలో 194 పరుగులు మాత్రమే చేసి అభిమానులను మరియు టీమ్ ఇండియా యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే ఇక్కడ తనకు కలిసి వచ్చింది ఏమిటంటే అన్ని మ్యాచ్ లలోనూ విజయాలు సాధించడం. కానీ ఒక జట్టుకు నాయకుడుగా ఉన్న వాడు..  తన ఆటలో మంచి ప్రదర్శన చూపిస్తూనే, జట్టును విజయాల  బాట పట్టించాలి. కానీ ఈ విషయంలో రోహిత్ శర్మ విఫలం అయ్యాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: