టీమిండియా అరుదైన రికార్డు.. ఇదే మొదటిసారి?
ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టి20 సిరీస్ లో విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా 10 టి20 మ్యాచ్ లలో విజయం సాధించినట్లు అయింది టీమిండియా. ఈ క్రమంలోనే భారత క్రికెట్ లో మొదటి సారి ఈ అరుదైన రికార్డును సాధించింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరుసగా పది టి20 మ్యాచ్ లలో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో అరుదైన రికార్డు సాధించింది టీమిండియా. దీంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఈ క్రమంలోనే యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వావ్ అనిపించగా , శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు , 2 సిక్సర్లు సత్తా చాటాడు, రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. అనంతరం ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 137 పరుగులు చేసి ఓటమి చవిచూసింది శ్రీలంక.