టీమిండియాకు ఆ ముగ్గురే భవిష్యత్తు కెప్టెన్లు : రోహిత్

praveen
మొన్నటి వరకు కేవలం పరిమిత ఓవర్ల ఫార్మట్ కి మాత్రమే కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవల టెస్టు కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. దీంతో ఇక అన్ని ఫార్మాట్లకు కూడా కెప్టెన్  గా మారిపోయాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మకు 34 ఏళ్ల వయసు. దీంతో ఎక్కువ రోజులు పాటు కెప్టెన్గా కొనసాగడం  మాత్రం చాలా కష్టమే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక టీమిండియా లో సరికొత్త సారధులను తయారు చేయాల్సిన బాధ్యత కెప్టెన్ రోహిత్ పై ఉంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్ కె.ఎల్.రాహుల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లను భారత జట్టుకు భవిష్యత్తు కెప్టెన్గా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.


 తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా ఇందులో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. టీమిండియాకు భవిష్యత్తు నాయకులను తయారు చేసే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. మేము కూడా ఒకప్పుడు సీనియర్ల నుంచి నేర్చుకునే ఈ స్థాయికి ఎదగాము..  ఇక మేము కూడా అదే పద్ధతిలో భవిష్యత్తు సారథి లను సిద్ధం చేస్తాము. రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బూమ్రా లు ఎంతో పరిణతితో ఆలోచించగల క్రికెటర్లు.. ముగ్గురికి కూడా అన్ని విషయాలు మనం నేర్పించాల్సిన అవసరం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేయడానికి ఒకరు కావాల్సి ఉంటుంది.


 ఇక టీమిండియా కోసం ఏం చేయాలో వారికి ఖచ్చితంగా తెలుసు. భవిష్యత్తులో ఇక జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించే బాధ్యత వారిపై ఉంది . ఇక ఇప్పుడే వారిపై మరింత ఒత్తిడి పెంచాలి అని అనుకోవడం లేదు. వారికి స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే తనను కెప్టెన్ గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు రోహిత్ శర్మ. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కూడా భవిష్యత్తు కెప్టెన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.. అయితే కెప్టెన్ గా నియమించే ఆటగాడు బ్యాట్స్మెన్ లేకపోతే బౌలర్ అన్న విషయం పక్కన పెట్టి సత్తా ఉంటే ఎవరినైనా ప్రోత్సహిస్తాం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.  జస్ప్రిత్ బూమ్రా వ్యూహాలు అద్భుతంగా ఉంటాయని.. కెప్టెన్సీ ఇచ్చిన అతడు మెరుగ్గా జట్టును నడిపించగలడు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: