ఐపీఎల్ : మా కొత్త కెప్టెన్ అతనే.. క్లారిటీ ఇచ్చిన ఫ్రాంచైజీ?

praveen
ఇటీవలే బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా వేలం ముగిసింది. ఇక ఈ మెగా వేలం లో భాగంగా అన్ని జట్లు కూడా ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరించాయ్. తమకు కావాల్సిన ఆటగాడు ఎవరు అన్నదానిపై ఫుల్ క్లారిటీ తో వ్యవహరించిన ఫ్రాంచైజీలు.. కొనుగోలు చేయాలి అనుకున్న ఆటగాళ్ల  కోసం పోటీపడి మరీ కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరైన కెప్టెన్ లను కూడా మెగా వేలంలోకి ఎంచుకోవడం గమనార్హం. ఇక ఇలాంటి వాటిలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా ఉంది అనే చెప్పాలి.



 కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు గౌతం గంభీర్ కెప్టెన్గా వ్యవహరించాడు. అనూహ్యంగా గంభీర్  కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో దినేష్ కార్తిక్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కానీ దినేష్ కార్తిక్ కెప్టెన్సీలో కూడా కోల్కతా నైట్రైడర్స్ జట్టు వరుసగా ఓటమిని చవి చూడటంతో.. కెప్టెన్సీ ని మార్చాలని డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పటికే ఒకసారి ప్రపంచకప్ను అందించిన ఆటగాడిగా కొనసాగుతూన్న ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ అప్పగించింది ఫ్రాంచైజీ. ఆ తర్వాత కూడా జట్టు అదృష్టం మాత్రం మారలేదు. కోల్కతా జట్టు సరైన ప్రదర్శన చేయలేకపోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవల మెగా వేల నేపథ్యంలో మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ ప్రస్తుత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా మెగా వేలంలోకి వదిలేసింది. ఇటీవలే మెగా వేలంలో పోటీ పడి మరీ ఒకప్పటి ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను 12.50 కోట్లకి దక్కించుకుంది కోల్కతా ఫ్రాంచైజీ. అతనికి కెప్టెన్సీ అప్పగించడం పక్క అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే శ్రేయస్ అయ్యర్ కోల్కతా  కొత్త కెప్టెన్ అంటూ ప్రకటించింది ఫ్రాంచైజీ. దీంతో కోల్కతా జట్టు అభిమానులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా ఎన్నో రికార్డులు సాధిస్తుందని  భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ జట్టు కెప్టెన్గా కొనసాగిన శ్రేయస్ అయ్యర్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: