కోహ్లీ ఫామ్ పై స్పందించిన బ్యాటింగ్ కోచ్.. ఏమన్నాడంటే?

praveen
విరాట్ కోహ్లీ.. ఇతని పేరు చెప్పగానే అతను సాధించిన రికార్డులు గుర్తుకు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి.  ఆ రేంజ్ లో రికార్డులను కొల్లగొట్టి ఇక ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ భారీ పరుగులు చేస్తూ ఉండేవాడు విరాట్ కోహ్లి. దిగ్గజ క్రికెటర్ లు  సాధించిన రికార్డులని తక్కువ సమయంలోనే బ్రేక్ చేస్తూ తన పేరును లిఖించుకునేవాడు. అలాంటి విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇక దాదాపు కోహ్లీ సెంచరీ చేసి 2 ఏళ్లు గడిచిపోతున్నాయి. దీంతో అభిమానులు విరాట్ కోహ్లీ నుంచి సాలిడ్ ఇన్నింగ్స్ కావాలి అంటూ కోరుకుంటున్నారు.


 కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని ఉంది అంటూ ఆశపడుతున్నారు అభిమానులు. అయితే ఇక ప్రతీ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ భారీ అంచనాలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నాడు. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్ ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ. బ్యాట్స్మెన్  గా కూడా రాణించడం లేదు అని చెప్పాలి. దీంతో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ టీమిండియాకు మైనస్ గా మారిపోతుంది. దీంతో విరాట్ కోహ్లీని టీమిండియా నుంచి తప్పిస్తారు అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఇక ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ గురించి మాకు ఆందోళన లేదని అతను బాగా ఆడుతున్నాడు అంటూ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ లో  చెప్పాడు.



 ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫాంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.  వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో భారీగా పరుగులు సాధిస్థాడని ఆశాభావం వ్యక్తం చేశారు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. అతని కెరీర్లో ఇది ఒక దశ మాత్రమే నని బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో అయినా రాణించే సామర్ధ్యం అతనికి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మరికొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ లోకి వస్తాడు అంటూ తెలిపాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: