ఊరటనిచ్చే వార్త... కాసేపట్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం...
ఐపీఎల్ సీజన్ 15 కోసం ప్లేయర్స్ కొనుగోలు చేయడానికి ఈ రోజు కర్ణాటక లోని బెంగుళూరు వేదికగా వేలం ప్రక్రియ ను స్టార్ట్ చేశారు. ఇది మొత్తం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి వేలం ప్రక్రియ మొదలైంది. అంతే కాకుండా ఈ వేలంపై ఎందరో యువ మరియు సీనియర్ ఆటగాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ధర ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంత మంది ఆటగాళ్లు తమకు ఫిక్స్ చేసిన ధర కంటే ఎక్కువ ధరను పొందుతారు అన్న పూర్తి విషయాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కాగా ఈ రోజు జరిగిన వేలంలో కొందరు ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఆక్షనీర్ సడెన్ గా అక్కడికక్కక్కడే కుప్ప కూలిపోయాడు. అయితే వేలంను ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న లక్షలాది మంది క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హ్యూ ఎడ్మీడ్స్ శ్రీలంక అల్ రౌండర్ వానిదు హాసరంగా కోసం మాట్లాడుతున్న సమయంలోనే పడిపోయాడు. వెంటనే అప్రమత్తం అయినా సిబ్బంది అతనిని హాస్పిటల్స్ కు తరలించారు. అతనిని బాగా పరిశీలించిన డాక్టర్స్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు.
ఈ ఘటనతో ఐపీఎల్ యాజమాన్యం తో పాటుగా ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా కంగారు పడ్డారు. కానీ ఈ ఆక్షన్ కాసేపట్లో తిరిగి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇది నిజంగా ఐపీఎల్ యాజమాన్యానికి ఊరట నిచ్చే వార్త అని చెప్పాలి. శుభమా అని ఐపీఎల్ 2022 సీజన్ వేలాన్ని స్టార్ట్ చేస్తే ఇలా జరగడం పై సందిగ్ధంలో పడ్డారు. ఇక మిగిలిన ఒకటిన్నర రోజులు సంబంధించి వేలం ఎ విధంగా జరగనుంది? ఎవరెవరు అధిక ధరను పొందనున్నారో తెలియాల్సి ఉంది.