ఐపీఎల్ మెగా వేలం.. ఆ జట్టు దగ్గరే ఎక్కువ డబ్బులు?

praveen
ప్రతి దేశపు క్రికెట్ బోర్డు దేశవాళి క్రికెట్ లీగ్ లను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లీగ్ లు ఉన్నప్పటికీ.. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. అంతేకాదు ఇక ప్రపంచంలోనే రిచ్చెస్ట్ లీగ్ గా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ఒకసారి ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్నారు అంటే కోట్ల రూపాయలు వెనకేసుకునెందుకు చాన్స్ ఉంటుంది  అంతే కాదు డబ్బులతోపాటు పేరు ప్రఖ్యాతలు కూడా ఎంతగానో వచ్చిపడతాయి.


 అదే సమయంలో ఊహించని రీతిలో అనుభవం వస్తుంది అందుకే భారత ఆటగాళ్లు మాత్రమే కాదు అటు విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్లో ఆడదానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాలనుకునే ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తాచాటి సెలెక్టర్ల చూపులు ఆకర్షించడం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈసారి ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇచ్చాయ్. లక్నో అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఐపీఎల్ పోరు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతోంది.


 ఇకపోతే మరికొన్ని నిమిషాల్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది బీసీసీఐ.  దీంతో అన్ని జట్లు కూడా కోట్ల రూపాయలు చెల్లించి నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇక ఇలా చూసుకుంటే ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటున్న జట్లలో  ఏ జట్టు దగ్గర ఎక్కువ డబ్బులు మిగిలాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్  వద్ద 72 కోట్ల రూపాయలు ఇక వీటితో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఇక అతి తక్కువ డబ్బులు కలిగి ఉన్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుంది. ఢిల్లీ కాపిటల్ దగ్గర 47.5 కోట్లు మెగా వేలం కోసం మిగిలి ఉన్నాయి. చెన్నై దగ్గర 48 కోట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: