ఆ గ్రౌండ్లో సిక్స్ కొట్టడం చాలా కష్టం : శ్రేయస్ అయ్యర్

praveen
టీమిండియాలో యువ ఆటగాడుగా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టులో అవకాశం కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూసిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు.. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారీగా పరుగులు చేస్తూ తనలో దాగివున్న బ్యాటింగ్ సత్తాని బయట పెడుతున్నాడు. ఇటీవలే జరిగిన వెస్టిండీస్ తో మూడవ వన్డే మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు.

 రిషబ్ పంత్ తో కలిసి నాలుగో వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని టీమిండియాకు అందించిన శ్రేయస్ అయ్యర్.. అటు వ్యక్తిగతంగా 80 పరుగులు కూడా చేసి అదరగొట్టాడు. టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుకోవడం లో కీలక పాత్ర వహించాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూస్తే సెంచరీ చేయడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ 80 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఈ తొలి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉండగా ఒక సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ బ్రేక్ సమయంలో ఒక స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అహ్మదాబాద్ గ్రౌండ్ ఎంతో పెద్దగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ పరుగులు చేయడం ఎంతో కష్టంగా మారుతుంది అంటూ తెలిపాడు. ఇక బౌలర్లు సంధించే బంతులు భుజాల ఎత్తులో వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి బంతులు బ్యాట్స్మెన్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.. రోహిత్, కోహ్లి, ధావన్ వికెట్లు కోల్పోయిన తర్వాత రిషబ్ పంత్ కు ఒక్క విషయం చెప్పాను. పిచ్ చాలా కఠినంగా ఉంది కాస్త ఓపికగా ఆడితే పరుగులు రాబట్టవచ్చు అని.. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టగలిగా అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. సెంచరీ మిస్ అయింది అన్న బాధ లేదు. ఎందుకంటే కఠినంగా కనిపిస్తున్న పిచ్ లో పురుగులు రావడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: