బాబోయ్ ఇంత చెత్త రికార్డా.. పాపం వెస్టిండీస్?

frame బాబోయ్ ఇంత చెత్త రికార్డా.. పాపం వెస్టిండీస్?

praveen
ఏ ఆటలో అయినా కొన్ని రకాల రికార్డులు ఉంటాయి.  అచ్చంగా ఇలాగే క్రికెట్లో అద్భుతమైన రికార్డులు చెత్త రికార్డులో ఉంటాయి. ఇక గొప్ప రికార్డులు సాధించినప్పుడు వావ్ సూపర్ అంటూ మెచ్చుకున్న క్రికెట్ అభిమానులు.. చెత్త రికార్డులు సాధించిన సమయంలో మాత్రం చూస్తూ ఉంటారు.. ఇక ఇప్పుడు వెస్టిండీస్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాము సాధించిన చెత్త రికార్డును ఎవరో బ్రేక్ చేయడం ఎందుకు మేమే బ్రేక్ చేసుకుంటాం అనుకుందో ఏమో  ఇటీవలే మరో చెత్త ప్రదర్శన చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది వెస్టిండీస్ జట్టు.


 ప్రస్తుతం వెస్టిండీస్ టీమ్ ఇండియా పర్యటనలు ఉంది. ఇక ఈ క్రమంలోనే మొదటవన్డే సిరీస్ ఆడింది.  ఇక ఈ వన్డే సిరీస్లో అటు వెస్టిండీస్ జట్టు మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది. మూడు మ్యాచ్ లా సిరీస్లో క్లీన్స్వీప్ అయ్యి సిరీస్   టీం ఇండియా చేతిలో పెట్టేసింది వెస్టిండీస్. అయితే ఈ మూడు మ్యాచ్ లలో కూడా వెస్టిండీస్ ఎక్కడ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది అనే చెప్పాలి. ఇక మ్యాచ్ లో కొంత మంది బ్యాట్స్ మెన్లు బాగా రాసినప్పటికీ ఫోర్లు సిక్సర్లు ప్రేక్షకులకు వినోదాన్ని కి పంచాయి తప్ప జట్టు విజయానికి పనికి రాలేదు.


 కాగా ఇటీవలే ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది వెస్టిండీస్. ఇక ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత చెత్త రికార్డు అనే చెప్పాలి. 2019- 22 మధ్యకాలంలో వెస్టిండీస్ విదేశీ పర్యటనల్లో 11వ సారి క్లీన్స్వీప్ అయింది. 1999 -20 మధ్యలో 9 సిరీస్ లలో క్లీన్స్వీప్ అయినా వెస్టిండీస్..  2009- 10 మధ్య కాలంలో 8 సిరీస్ లలో వైట్వాష్ అయ్యింది. ఇక ఇప్పుడు 2019- 22 మధ్యకాలంలో 11 సిరీస్ లో క్లీన్ స్వీప్ అయ్యి చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: