క్రికెట్ మానేసి.. ఆటో తోలుకో?
అయితే 2019 ఐపీఎల్ లో సిరాజ్ ఎంతో చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో ఇక ఈ యువ పేసర్ కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. ఇక ఆ తర్వాత టీమిండియాలో అవకాశం వచ్చినా తనని తాను నిరూపించుకో లేకపోయాడు. దీంతో ఇక ఇతను బౌలర్గా పనికిరాడు అని అనుకున్నారు. కానీ రెండూ సంవత్సరాల వ్యవధి లోనే ప్రస్తుతం ఐపీఎల్ బెంగళూరు జట్టులో ఫ్రంట్లైన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు సిరాజ్. గొప్ప బౌలర్గా ఎదుగుతున్నాడు. ఇకపోతే ఇటీవలే మొహమ్మద్ సిరాజ్ ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చాడు.
2019 సమయంలో నాకు చీకటి రోజులు అని చెప్పుకొచ్చాడు బెంగళూరు తరఫున ఆడుతున్న తాను కేకేఆర్ తో మ్యాచ్ జరిగిన సమయంలో దారుణమైన ప్రదర్శన కనబరిచా.. జట్టు ఓటమికి కారణం గా మారిపోయా.. దీంతో ఇక తనకు కెరీర్లో ఇదే చివరి రోజులు అని భావించాను. ఆ సమయంలో తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. క్రికెట్ ను వదిలేసి వెనక్కి వెళ్ళిపోయి తండ్రితో పాటు ఆటో తోలుకో అంటూ ఎంతోమంది అవమానకరంగా కామెంట్లో చేసేవారు. ఇలాంటివి ఎన్నో భరించాను ఆర్సిబి నాకు అండగా నిలిచింది. చెత్త ప్రదర్శన చేసిన కూడా నాపై వేటు వేయకుండా జట్టులో కొనసాగించింది. 2020 ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేశా.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.