రోహిత్ కెప్టెన్సీకి.. సునీల్ గవాస్కర్ 10 కి ఎన్ని మార్కులు ఇచ్చాడో తెలుసా?

praveen
మొన్నటి వరకు భారత క్రికెట్ కెప్టెన్ కొనసాగాడు విరాట్ కోహ్లీ. కానీ ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలిపించకపోవడంతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి  అంటూ డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య మూడు ఫార్మాట్లా నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్ గా అవతరించాడు. ఇప్పటికే ఐపీఎల్ లో తన కెప్టెన్సీని సామర్థ్యాన్ని నిరూపించుకున్న రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఎలా రాణిస్తాడు అన్నదానిపై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎలా ఉంటుంది అనే దానిపై అందరీ ప్రత్యేక దృష్టి ఉండటం గమనార్హం..

 దీంతో ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్లో కూడా తన అద్భుతమైన కెప్టెన్సీ వ్యూహాలతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ముఖ్యంగా మాజీ ఆటగాళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మొదటి మ్యాచ్లో తన అద్భుతమైన వ్యూహాలతో ఏకంగా వెస్టిండీస్ పై ఆధిపత్యం సాధించి.. ఆరు వికెట్ల తేడాతో జట్టుకు విజయం అందించాడు రోహిత్. టీమిండియా విజయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.

 రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. టాస్ గెలవడం నుంచి మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం వరకు ఇక పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జట్టుకు కెప్టెన్గా ముందుకు నడిపించడంతో పాటు కీలక బ్యాట్స్మెన్గా అర్థశతకం సాధించడం వరకు కూడా అతని ప్రతిభ అద్భుతం అంటూ పేర్కొన్నాడు సునీల్ గవాస్కర్. కెప్టెన్ గా  రోహిత్ కి ఇలాంటి ఆరంభమే కావాలని ఆశిస్తాడు అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీకి 10 కి 9.99 మార్కులు ఇచ్చాడు సునీల్ గవస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: