నేను కెప్టెన్ లాగే ఉంటా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?

praveen
మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఊహించని పరిణామాలు నేపథ్యంలో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తప్పుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు విరాట్ కోహ్లీ. ఇటీవలే ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు కెప్టెన్గా లేకపోయినప్పటికీ తాను ఎప్పుడూ నాయకుడిగానే ఆలోచిస్తాను అంటూ తెలిపాడు. ఇక కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 జట్టులో నాయకుడిగా ఉండేందుకు కెప్టెన్సి అవసరం లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో అతని స్థాయి ఏమాత్రం తగ్గలేదు అంటూ గుర్తు చేశాడు విరాట్ కోహ్లీ. అతను జట్టులో కొనసాగినన్ని రోజులు కూడా అతని నుంచి ఎన్నో సలహాలు తీసుకునే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్సీ ని వదిలేసి ముందుకు సాగడం కూడా ఒక నాయకుడి లక్షణమే అవుతుంది. కాకపోతే మన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్నిరకాల పాత్రలను పోషించాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 గతంలో ధోనీ కెప్టెన్సీలో నేను ఎన్నో మ్యాచ్ లలో ఆడాను. ఇక ఆ తర్వాత కెప్టెన్ గా మారాను. అప్పుడు ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకే లాగా ఉంది.. జట్టులో సాదా సీదా ఆటగాడిగా కొనసాగినప్పటికీ ఎప్పుడూ కెప్టెన్గా ఆలోచిస్తానని గెలుపోటములు అనేవి మన చేతుల్లో ఉండవు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆ జట్టు విజయం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. భారత జట్టు సంస్కృతిని మార్చడం చాలా కష్టమైన విషయం. నేను కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు శాయశక్తుల   ప్రయత్నాలు చేశాను. ఇక ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది అని అందరూ గ్రహించాలి.. అలా గ్రహించినప్పుడే జట్టులో తన పాత్రకి పూర్తి న్యాయం చేయగలరని అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: