
ఇదేం ట్విస్టు.. సన్ రైజర్స్ లోకి సురేష్ రైనా?
ఐపీఎల్లో ఆదాయాన్ని అందరూ క్యాష్ చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇక ఇదంతా జరగడానికి ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడమే కారణం. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీలలో మెగా వేలం జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఇలా మెగా వేలం కోసం అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగి.. ఇటీవలే మెగా వేలంలో కి వదిలివేయబడిన సురేష్ రైనా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
మొన్నటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన సురేష్ రైనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడబోతున్నాడు అనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎలాగైనా సురేష్ రైనాను దక్కించుకోవాలని సన్రైజర్స్ మేనేజ్మెంట్ ఫిక్స్ అయిపోయిందట. అయితే గత సీజన్లలో సురేష్ రైనాకు 11 కోట్లు చెల్లించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఇప్పుడు రానున్న వేలంలో సురేష్ రైనాను దక్కించుకునేందుకు ఏకంగా 10 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించుకుందట సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం మరి కొన్ని రోజుల్లో ఓ క్లారిటీ రాబోతుంది.