సన్ రైజెర్స్ లో ధోని పెట్టుబడి.. ఫ్యాన్స్ షాక్?
అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఇప్పుడు ప్రత్యర్థి జట్టు అయినా సన్రైజర్స్ హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ అంటే ప్రాణంగా బ్రతికిన మహేంద్ర సింగ్ ధోనీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో పెట్టుబడులు పెట్టడం ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహేంద్రసింగ్ ధోని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.
2015 లో కార్స్24 అనే సంస్థలో ధోని పెట్టుబడి పెట్టాడు. ఇక ఈ సంస్థకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది కార్స్24 సంస్థ.. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పరోక్షంగా మహేంద్ర సింగ్ ధోనీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో పెట్టుబడులు పెడుతున్నాడు అన్న టాక్ మొదలైంది.