కోహ్లీ దిగ్గజం ఎలా అవుతాడు.. మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం విరాట్ కోహ్లీ తక్కువ సమయంలోనే బద్దలు కొట్టాడు. దీంతో కోహ్లీ ఒక రకంగా దిగ్గజ క్రికెటర్ అంటూ పిలిపించుకున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ అసలు దిగ్గజ క్రికెటర్ ఎలా అవుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు సంజయ్ మంజ్రేకర్. ఆల్టైమ్ గ్రేట్ భారత కెప్టెన్ లలో ఒకడిగా విరాట్ కోహ్లీ ని అస్సలు పరిగణించలేము అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్. గతంలో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన వారితో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఐసీసీ ఈవెంట్లలో తడబడుతూ ట్రోఫీలు సాధించడంలో పూర్తిగా విఫలం అయిపోయాడు అంటూ కామెంట్ చేశాడు.


 కెప్టెన్గా కాదు కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కోహ్లీ న్యాయం చేసాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత దిగ్గజ క్రికెటర్ లలో మహేంద్రసింగ్ ధోని ఒక దిగ్గజ కెప్టెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన విజయాలు.. ఐసిసి  ట్రోఫీలు అతను దిగ్గజం అని నిరూపిస్తూ ఉంటాయి. 2007,2011, 2013లో ఐసిసి ఈవెంట్ లలో    భారత్ ను విశ్వ విజేతగా నిలిపాడు. ఆల్ టైం గ్రేట్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే ధోని గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. కపిల్ దేవ్, సౌరబ్ గంగూలీ, సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు కూడా భారత జట్టును ఎంతో మెరుగ్గా నడిపించారు. వీరందరూ భారత క్రికెట్ లో గొప్ప సారథులుగా దిగ్గజాలు గా మిగిలిపోయారు.


 వాళ్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ లో కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. పోరాట స్ఫూర్తితో కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాడు. ఇక ఎప్పుడూ జట్టులో గొప్పగా పోరాడాడు. చివరి వరకు  విజయం కోసం పోరాడుతూ ఉంటాడు. ఐసిసి ఈవెంట్లలో మాత్రం కోహ్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు అని చెప్పాలి. కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే గొప్ప గా రాణించిన కోహ్లీ కెప్టెన్ గా మాత్రం అంతర్జాతీయ  టోర్నీలో ట్రోఫీలు సాధించడానికి విఫలమయ్యాడు. కోహ్లీ సారథ్యంలో 2017,2019, 2021 లలో ఐసీసీ టోర్నీలో ఆడింది భారత జట్టు. కానీ ఒక్క ట్రోఫీ కూడా విజయం సాధించలేక పోయింది. అందుకే విరాట్ కోహ్లీ దిగ్గజ కెప్టెన్ అవ్వలేడు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: