ఐపీఎల్ మెగా వేలంలో.. ఆ దేశం నుంచి తొలి ఆటగాడు?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్లో రిచ్చేస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది ఐపీఎల్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఒక్కసారి ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యారూ అంటే చాలు కోట్ల రూపాయలు వెనక్కి తీ వేసుకోవచ్చు. ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు కూడా వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ లో రాణించినప్పటికీ రాని గుర్తింపు ఐపీఎల్లో ఒక సీజన్లో రాణించారు అంటే ప్రపంచ క్రికెట్లో  పేరు మారుమోగుతూనే ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఆసక్తి చూపుతుంటారు ఇక ఈసారి ఎంతోమంది కొత్త ఆటగాళ్లు పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.ఫిబ్రవరి 12, 13 తేదీలలో మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా వేలంలో ఏకంగా 1214 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక ఇందులో భూటాన్ కు చెందిన ఆల్ రౌండర్ మిక్యో డోర్జి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం గమనార్హం. ఇప్పటివరకు భూటన్ నుంచి ఎవరు కూడా ఐపీఎల్ వేలంలో పాల్గొన లేదూ. దీంతో ఇక ఇలా ఐపీఎల్ లో పాల్గొన్న తొలి క్రికెటర్ గా మిక్యో డోర్జి రికార్డ్ సృష్టించనున్నాడు. ఇక ఈ ఆటగాడిని ఎవరైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

 కాగా చెన్నై సూపర్ కింగ్స్ను నాలుగుసార్లు విజేతగా నిలిచిన మహేంద్రసింగ్ ధోని కలిసి దిగిన ఫొటోని మిక్యో డోర్జి తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ధోని సంతకం చేసిన జెర్సీ ధోని చేతుల మీదుగా అందుకున్నాడు.  దీనికి సంబంధించిన వీడియోని మిక్యో డోర్జి షేర్ చేసాడు. ఈ విషయాన్ని సింపుల్ గానే ఉంచు.. ఆట మీద దృష్టిపెట్టు.. రిజల్ట్ గురించి ఆలోచించవద్దు..  ప్రక్రియ సరిగా నెరవేర్చితే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆటను ఎంజాయ్ చెయ్ ఒత్తిడి దరిచేరనీయకు అంటూ మిక్యో డోర్జికు ధోని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: