అర్థమవుతుందా.. మేము కాపీ కొట్టట్లేదు : గంభీర్

praveen
భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు గౌతం గంబీర్ దూకుడైన  ఆట తీరుకు  కేరాఫ్ అడ్రస్ గా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగిన తరువాత కెప్టెన్సీ వదులుకోవడమే కాదు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి మళ్ళీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు గౌతం గంభీర్. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా ఐపీఎల్ లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టుకి మెంటర్ గా అవతారమెత్తాడు.



 ఈ క్రమంలోనే జట్టు పటిష్టంగా మార్చేందుకు లక్నో సూపర్ జయింట్స్ జట్టును వెనకుండి  నడిపిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా లక్నో జట్టు  గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు గౌతమ్ గంభీర్.  ప్రస్తుతం లక్నో జట్టులో రిటన్ చేసుకున్నా మణికట్టు స్పిన్నర్ రవి బిష్ణాయ్ ఖచ్చితంగా వికెట్ టేకర్ అంటూ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అతడు ఎంతో ప్రతిభ కలిగిన యువ బౌలర్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తుది జట్టులో కొనసాగేందుకు అర్హత కలిగిన ఆటగాడు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.


 అదే సమయంలో ఇక జట్టు ప్రణాళికలపై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఇంతకుముందెన్నడూ రూపొందించని విధంగా లక్నో జుట్టు ను రూపొందించే అవకాశం వచ్చింది. జట్టును రూపొందించే విషయంలో ఎవరినీ కాపీ కొట్టాలని అనుకోవట్లేదు అంటూ వ్యాఖ్యానించాడు. మా ప్రణాళికలు మాకు ఉన్నాయి.. మా ప్రత్యేకత మాకు ఉండాలి కదా కొత్తగా జట్టును అద్భుతంగా రూపొందించడం అనేది గొప్ప ఛాలెంజ్.. అయితే కేవలం ఒకే ఒక్క ఏడాది కోసం జట్టును తయారు చేయాలి అనుకోవట్లేదు ఇక భవిష్యత్తు పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు గౌతం గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: