షాకింగ్ : కోహ్లీ టీమ్ మేట్ పై పోలీసుల దాడి?

praveen
మొన్నటి వరకు  భారత కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే  కోహ్లీ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వచ్చింది అంటే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కేవలం కోహ్లీ కి సంబంధించింది కాదు కుటుంబ సభ్యులు స్నేహితులకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారిపోతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.. ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్సీలో ముందుకు నడుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఆడిన  భారత ఆటగాడు పై పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పోలీసుల దాడిలో ఏకంగా వికాస్ కన్ను భాగంలో కూడా గాయం అయినట్లు తెలుస్తోంది.


 జనవరి 26 వ తేదీన ఢిల్లీ శివారు లోని తన గ్రామం లో మాస్క్ పెట్టుకోలేదని  పోలీసుల నిలదీశారు. మాస్క్ పెట్టుకొనందుకు ₹2000 ఫైన్ కట్టమన్నారూ. కానీ నేను కట్టను అని చెప్పడంతో నాతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడటం చేశారు. ఈ క్రమంలోనే ఒక పోలీస్ నాపై దాడి చేశారు. నా కన్ను కి గాయం కూడా అయ్యింది  అంటూ వికాస్ ఆరోపిస్తున్నాడు. కానీ తాను రైఫిల్ పట్టుకొని పారి పోయాను అంటూ  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారూ దీనికి సంబంధించి డిజిపి కి లేఖ రాసినట్లు చెబుతున్నాడు వికాస్ . ఇదిలా ఉంటే పోలీసులు చెబుతోంది మరోలా ఉంది .


 మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు పోలీసులపై కి ఎదురు తిరిగాడని నేషనల్ క్రికెట్ ప్లేయర్ నన్నే ప్రశ్నిస్తారా అంటూ బూతులు తిట్టాడని పోలీసులు చెబుతున్నారు. జాతీయ స్థాయి క్రికెటర్ ను ఒక కానిస్టేబుల్ నువ్వు ఎలా ఆపుతావా అంటూ గొడవ పెట్టుకున్నాడు.. ఇక అంతలోనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేసాడు. ఇక ఈ క్రమంలోనే జరిగిన తోపులాటలో యాదృచ్చికంగా అతని కంటికి గాయం అయింది అంటూ పోలీసులు వివరిస్తున్నారు. ఇప్పుడు వికాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ అటు పోలీసులు అంటున్నారు.. ఇకపోతే వికాస్ 2016 ఐపీఎల్ లో ఆర్సిబి తరుపున ఆడాడు. ఆ తర్వాత మాత్రం మళ్లీ కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: