క్రికెటర్ కృనాల్ పాండ్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... కారణమిదే?
అయితే ఈ హ్యాకింగ్ కు పాల్పడింది బిట్ కాయిన్ కు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. ఇప్పటికి కూడా క్రునాల్ ట్విట్టర్ అకౌంట్ హ్యకర్ కంట్రోల్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇతను ఎందుకు చేశారు అనే విషయానికి వస్తే, బిట్ కాయిన్ కోసం ఈ అకౌంట్ ను అమ్ముతున్నట్లు మెసేజ్ లో ఉంది. ఇవాళ ఉదయం నుండి కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుండి పలు రకాల మెసేజ్ లు వస్తున్నాయి. ఈ మెసేజ్ లలో ఈ అకౌంట్ ను నేను అమ్మేస్తున్నాను. నాకు బిట్ కాయిన్ లు పంపండి అని ఉంది.
అయితే కృనాల్ ఇలా చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నెటిజన్లు తమకు నచ్చిన విధంగా వాడుకుంటున్నారు. నిన్న వెస్ట్ ఇండీస్ టూర్ కోసం ప్రకటించిన జట్టులో కృనాల్ పాండ్యకు చోటు దక్కలేదని తెలిసిందే. తనను కాకుండా దీపక్ హోదాను సెలెక్ట్ చేసినందుకే ఇలా హ్యాకింగ్ డ్రామా ఆడుతున్నడని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.