కోహ్లీకి షోకాజ్ నోటీసులు.. గంగూలీ మనసులో ఏముంది?

praveen
ఇటీవలే సౌతాఫ్రికా టూర్ లో భాగంగా టెస్ట్ కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించిన విరాట్ కోహ్లీ ఇక టెస్టు సిరీస్లో ఓడిపోవడంతో ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ ప్రకటించాడు. గతంలోనే టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ టాటా చెప్పగా ఇక ఆ తర్వాత బిసీసీఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో ఒక సాదా సీదా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్ గా తనకు అవకాశం ఇచ్చిన బిసిసిఐకి కృతజ్ఞతలు.. ప్రస్తుతం ఒక సీనియర్ ప్లేయర్ గా  జట్టులో కొనసాగుతాను అంట చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఇటీవల సౌతాఫ్రికా టూర్ లో ప్రారంభమైన వన్డే సిరీస్లో యువ ఆటగాడు కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా కొనసాగుతుండగా కోహ్లీ మాత్రం ఒక సాదాసీదా ఆటగాడిగానే మ్యాచ్ ఆడుతూ ఉండటం గమనార్హం.

 అయితే ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది. కానీ గతంలో సౌత్ఆఫ్రికా టూర్ కి ముందు విరాట్ కోహ్లీ పెట్టిన ప్రెస్ మీట్ ఎంతలా వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తపిస్తున్న సమయంలో మేము ముందుగానే సమాచారం ఇచ్చామని.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కి ఓకే కెప్టెన్ ఉండాలి అనుకున్నాము కాబట్టి విరాట్ కోహ్లీని తప్పించాము బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఇక ఇదే విషయం పై ప్రెస్ మీట్ పెట్టిన విరాట్ కోహ్లీ.. నన్ను అడగకుండానే బిసిసిఐ నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు.  బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పు కోవద్దు  అని అడగ లేదు అంటూ చెప్పడం సంచలనం గానే మారిపోయింది.

 ఇలా కోహ్లీ పెట్టిన ప్రెస్ మీట్ కాస్త అటు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లి మధ్య చిన్నపాటి వివాదానికి దారితీసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా టూర్కు ముందు ప్రెస్ మీట్ లో  కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు గాను బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుతం సౌరవ్ గంగూలీ కోహ్లీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇక మరికొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నాడట  సౌరబ్ గంగూలీ. అయితే గతంలో జరిగిన ప్రెస్ మీట్ విషయమే కాదు ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు కోహ్లీ బిసిసిఐకి చర్చలు జరపకపోవటం కూడా  ఇలా షోకాజ్ నోటీసులు పంపించడానికి కారణం అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: