ఇంకా నిరూపించుకోవడానికి ఏం లేదు : కోహ్లీ

praveen
మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం కేవలం టెస్టు ఫార్మాట్ కు మాత్రమే కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. కానీ రెండవ టెస్ట్ మ్యాచ్లో అటు సౌత్ ఆఫ్రికా జట్టు పట్టు బిగించడంతో చివరికి ఓటమి చవిచూసింది టీమిండియా. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1  సమంగా కొనసాగుతుంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ విజేత ఎవరో నిర్ణయించే ఉత్కంఠభరితమైన మ్యాచ్ గా మారిపోయింది.

 ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ మూడవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి మళ్లీ అందుబాటులోకి వచ్చేశాడు. కాగా మూడవ టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కేప్ టౌన్ వేదికగా ఇక ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విరాట్ కోహ్లీ అటు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉన్నట్లు విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు..

 ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి పేలవ ఫామ్ లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన ఫామ్ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.  గతంలో నేను నెలకొల్పిన రికార్డులతో పోల్చుతూ.. నా వ్యక్తిగత ఫామ్ పై చాలా రోజుల నుంచి రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని వేళలా జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నేను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. నేను టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు టీమిండియా ఏడవ స్థానంలో ఉండేది. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ప్రతి మ్యాచ్ గెలవాలనే సంకల్పంతోనే ఆడుతూ ఉంటాం అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: