సఫారీలతో ఆఖరి టెస్ట్... సిరీస్ మనదేనా ?

VAMSI
రేపు సౌత్ ఆఫ్రికా మరియు ఇండియాల మధ్య కేప్ టౌన్ వేదికగా ఆఖరి టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఇండియా మరియు రెండవ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా గెలుపు బావుటా ఎగురవేశాయి. సిరీస్ డిసైడర్ కోసం రెండు జట్లు రేపటి నుండి పోటీ పడనున్నాయి. అయితే ఈ గ్రౌండ్ లో ఇండియాకు ప్రతికూలమయిన రికార్డులు ఉన్నాయి. అందుకే భారత శిభిరంలో కొంచెం నిరాశ ఉంది. కానీ నేటి జనరేషన్ ఈ రికార్డులను పట్టించుకునే అంత తీరికగా లేదు అనే చెప్పాలి. ఒక రికార్డు వచ్చిందంటే... అది ఖచ్చితంగా బద్దలవ్వాల్సిందే. భారత ప్రేక్షకులు రేపు టెస్ట్ లో గెలుపొంది సిరీస్ ను సాధించాలని కోరుకుంటున్నారు.
అయితే రేపు తుది జట్టు విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయని అంత అనుకుంటున్నారు. గత మ్యాచ్ లో ఓడిపోవడంతో కొందరి ఆటగాళ్లను పక్కన పెడతారా అని రూమర్లు వినపడుతున్నాయి. ఇందులో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. రేపు మ్యాచ్ సమయానికి ఏమైనా అప్డేట్స్ వస్తాయో లేదో చూడాలి. గతంలో ఈ గ్రౌండ్ లో ఆడిన అయిదు టెస్ట్ లకు గానూ మూడు డ్రా గా ముగియగా, మిగతా రెండు టెస్ట్ లలో సౌతాఫ్రికా గెలిచింది. మరి అదే విన్నింగ్ రికార్డును కొనసాగిస్తుందా లేదా భారత ఆటగాళ్ల ప్రదర్శన ముందు తలవంచుతారా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే రేపు మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే, ఒక ప్రణాళిక ప్రకారం ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుసగా విఫలం అవుతున్న సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా మరియు అజింక్యా రహానేలు స్థాయికి తగిన ప్రదర్శన చేయాలి. ఇక గత రెండేళ్ల నుండి కనీసం ఒక టెస్ట్ సెంచరీ కూడా చేయని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అయినా తన పవర్ ఏమిటో చూపించాలి. ఇక గత మ్యాచ్ లో గాయ పడ్డ సిరాజ్ రేపటి మ్యాచ్ కు ఆ అందుబాటులో ఉండడు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: