మహేంద్ర సింగ్‌ ధోని.. ఎవరికీ చెప్పకుండా అంత పని చేసేశాడు!

Veldandi Saikiran

మహేంద్ర సింగ్‌ ధోని గురించి కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు. జార్ఖండ్ డైనమైట్ గా పేరు తెచ్చుకున్న ధోని... మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా నిలిచాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత ఎవరు ఊహించని విధంగా ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన... ఇప్పటికి అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోని క్రికెట్ చరిత్ర లో.... అత్యుత్తమ కెప్టెన్ గా.. వికెట్‌ కీపర్‌గా.. ఫినిషర్‌గా..  ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా.. ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా ధో ని చాలా మంది అభిమానుల మనసు సంపాదించుకున్నాడు. 2021 ప్రపంచ కప్ లో ఇండియాను ఓడించిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు చాలా మంది ధోని వద్దకు వచ్చి మాట్లాడిన ఫోటోలు అప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ జట్టు ఆటగాళ్లతోనైనా ఒకేలా ఉండే ధోని...  ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు
ఈ కెప్టెన్ కూల్. పాకిస్థాన్ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సంతకం చేసిన తన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని పాక్ ఆటగాడికి పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ‘‘కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన జెర్సీ ఇది. ఈ నెంబర్‌ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’’ అంటూ పోస్ట్ చేస్తూ... ధోనిపై తనకున్న అభిమానాన్ని చూపించాడు. ఇక ఈ పాక్ ఆటగాడి పోస్ట్ కు... సీఎస్‌కే మేనేజర్‌ స్పందిస్తూ.. ‘‘మా కెప్టెన్‌ మాట ఇచ్చాడంటే.. తప్పకుండ నెరవేరుస్తాడు’’ అంటూ తెలిపాడు. అయితే యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్‌ 2021లో ధోని చె న్నై జట్టును చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: